Priyanka Chopra: ఒక్క నక్లెస్ అంత ఖరీదా.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Priyanka Chopra: ఒక్క నక్లెస్ అంత ఖరీదా.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్(Nick Jonas) ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇటీవలే సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రియాంక. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్రీన్ అయిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి నెట్టింట వైరల్ గా మారారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఆమె భారత వ్యాపార దిగ్గజం అంబానీ ఇంట జరిగిన వేడుకల్లో తళుక్కుమన్నారు. ఈ వేడుకల్లో ఆమె గులాబీ రంగు డ్రెస్ లో కనిపించి కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సమయంలో ఆమె ధరించిన ఆభరణం, దాని ఖరీదు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ నక్లెస్ అత్యంత విలువైన వజ్రాలతో చేయబడిందట. దాని ఖరీదు కూడా దాదాపు రూ.9 కోట్లకు పైనే ఉంటుందని టాక్. దీంతో ఆ నక్లెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఒక నక్లెస్ ఖరీదు రూ.9 కోట్లా అంటూ నోరెళ్లబెడుతున్నారు.