ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎస్పీ, బీఎస్పీ ఎక్కడ.?

V6 Velugu Posted on Oct 31, 2021

తన ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోబోమన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని SP, BSP తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు SP, BSP  ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు ప్రియాంకగాంధీ. పాకిస్థాన్ మన దేశాన్ని వేలెత్తి చూపితే.. ఇందిరాగాంధీ దాన్ని రెండు విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బగేల్. మహిళలకు అవకాశం వస్తే చాలా గొప్ప పనులు చేస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లో జరిగిన బహిరంగసభలో నేతలు మాట్లాడారు. 

 

Tagged Bjp, Priyanka Gandhi, relationship, Gorakhpur, congress

Latest Videos

Subscribe Now

More News