
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈదారుణానికి ఒడిగట్టిన మహ్మద్ పాషా, గుడిగండ్ల గ్రామానికి చెందిన శివ, నవీన్, చెన్నకేశల్ని లారీ నెంబర్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నార్సింగ్ ఎస్ ఓటీ పోలీసులు ప్రియాంక హత్య గురించి విచారిస్తున్నట్లు సమాచారం. హత్య ఎలా జరిగింది..? హత్యలో ఇంకెవరి ప్రమేయం ఉందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు ప్రియాంకపై జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంకను హత్యాచారం చేసేందుకు దుండగులు తొండూ పల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న రూమ్ లోకి లాక్కెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. నలుగురు కలసి నోట్లో గుడ్డ కుక్కి ఈడ్చుకు వచ్చినట్టు వెలుగులోకి వచ్చాయి. డోర్ లాక్ ఉండడం తో కిటికీ లోంచి లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు. సాధ్యం కాక పోవడం తో రూమ్ వద్దే అఘాయిత్యానికి పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు.