
ప్రియాంక రెడ్డి హత్యకేసు నిందితుల్ని సీపీ సజ్జనార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం హత్య జరిగిన తీరును వివరించారు. ఈ సందర్భంగా హత్యకేసులో
ఏ1. మహ్మద్ ఆరిఫ్ (26)
ఏ2.జొల్లు శివ (20)
ఏ3.జొల్లు నవీన్ (20)
ఏ4. చెన్నకేశవుల్ని (20) నిందితులుగా గుర్తించారు.
లారీ అన్ లోడింగ్ కు వచ్చిన ఈ నలుగురు లోడ్ తీసుకోవాల్సిన వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో టోల్ ప్లాజ్ వద్ద పార్కింగ్ చేశారు. టోల్ ప్లాజా వద్ద లారీని ఆపేసిన నిందితులు మద్యం సేవించారు. అదే సమయంలో టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం 5:30కు ప్రియాంక రెడ్డి స్కూటీని పార్క్ చేసింది. అనంతరం అక్కడి నుంచి మాదాపూర్ వెళ్లింది. పనిమీద వెళ్లిన ప్రియాంక రాత్రి 9.18కు స్కూటీ కోసం వచ్చింది.
అయితే మద్యం సేవిస్తున్న ఈ నలుగురు ప్రియాంక రాకను గమనించారు. మద్యం సేవిస్తూ ప్రియాంక రెడ్డి అఘాయిత్యంపై ప్లాన్ చేశారు. రేప్ ఎలా చేయాలి..? ఎక్కడికి తీసుకెళ్లాలి అని చర్చించుకుంటుండగా..ఏ3 నిందితుడు జొల్లు నవీన్ ప్రియాంక బైక్ గాలి తీయాలని, తీసిన వెంటనే ఆమెను ఏమార్చేలా ప్లాన్ చేశాడు. ప్లాన్ అమలయ్యేలా..తన స్కూటీ కోసం వచ్చిన ప్రియాంకకు స్కూటీ టైర్ పంక్చర్ అయ్యిందని ప్రధాన నిందితుడు మహ్మద్ నమ్మించాడు. మరో నిందితుడు శివ స్కూటీ గాలి కొట్టించేందుకు తీసుకెళ్లాడు. గాలి కొట్టించి తీసుకెళ్లే సమయంలో ప్రియాంకను బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేశారు. అదే సమయంలో బాధితురాలి నోరుముయ్యడంతో ఊపిరి ఆడక మృతి చెందింది.
అనంతరం ప్రియాంకను కాల్చేందుకు ఒక ప్రెటోల్ బంక్ లో పెట్రోల్ కోసం వెళ్లగా అక్కడ తిరస్కరించారు. మరో పెట్రోల్ బంక్ కు వెళ్లారు. డెడ్ బాడీని చటాన్ పల్లికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరోసారి డెడ్ బాడీ పూర్తిగా కాలిందా లేదా అని చెక్ చేసుకున్నారు. పూర్తిగా కాలినట్లు కన్ఫాం చేసుకున్న నిందితులు ఆరాంఘర్ నుంచి పరారయ్యారు. ప్రియాంకను హత్య చేసి 23కిలోమీటర్లు వెళ్లినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు వెళ్లడించారు.
మరోవైపు ప్రియాంకరెడ్డి ఇన్నోసెంట్ ను నిందితులు ఆసరాగా తీసుకున్నారని సజ్జనార్ తెలిపారు. బైక్ పక్చంర్ అయ్యిందని నిందితులు చెప్పడంతో..ప్రియాంక వారిని నమ్మిందని చెప్పారు.
ప్రియాంకరెడ్డి హత్యపై మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే పోెలీసులకు వెంటనే ఫోన్ చేయాలని కోరారు.