ప్రియాంక రెడ్డి హత్య : బైక్ పంక్చర్ చేసింది మహ్మద్ పాషానే

ప్రియాంక రెడ్డి హత్య : బైక్ పంక్చర్ చేసింది మహ్మద్ పాషానే

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా అని పోలీసులు తేల్చారు.  ఘటన జరిగిన మధ్యాహ్నం 4 గంటలకి రాయచూర్ నుండి లారీని లోడ్ అన్లోడ్ చేసుకుని  శంషాబాద్ టోల్ ప్లాజా పక్కన పార్క్ చేశారు. పార్క చేసిన అనంతరం  పీకల్లోతు మధ్యం సేవించినట్లు సమాచారం. మద్యం మత్తులో పాషా ప్రియాంక హత్యకు ప్లాన్ చేశాడు.  ప్రియాంక రెడ్డి బైక్ పార్క్ చేయడం చూసిన ప్రధాన నిందితుడు  ఆమె వచ్చే లోపు టైర్  పంక్చర్ చేశాడు. పని ముగించుకొని తిరిగి ప్రియాంక రెడ్డి రాగానే నిందితులు  పంక్చర్ డ్రామాలు ఆడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ప్రియాంకను టోల్ ప్లాజా వద్ద లాక్కెళ్లిన దుండగులు
పథకం ప్రకారమే ప్రియాంక స్కూటీ పంక్చర్