
ఐపీఎల్ 2025 సీజన్ లో తన బ్యాటింగ్ తో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్ ప్రియాంష్ ఆర్య చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 బంతుల్లో సెంచరీ చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ పంజాబ్ కింగ్స్ క్రికెటర్ ఓవరాల్ గా ఈ సీజన్ లో 179 స్ట్రైక్ రేట్‌తో 475 పరుగులు చేసి అదరగొట్టాడు. భవిష్యత్ లో టీమిండియాలోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్న ఈ 24 ఏళ్ళ యంగ్ బ్యాటర్.. టెస్ట్ క్రికెట్ లో తన ఐడల్ ఎవరో చెప్పుకొచ్చాడు. సాధారణంగా క్రికెటింగ్ ఐడల్ అంటే దిగ్గజ క్రికెటర్లు పేర్లు చెబుతారు. కానీ ఆర్య మాత్రం ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ పేరు చెప్పుకొచ్చాడు.
ఆర్య మాట్లాడుతూ.. "నేను రెడ్-బాల్ క్రికెట్ ఆడాలనుకున్నా నా అరంగేట్రం ఇంకా జరగలేదు. ఈ సంవత్సరం రెండ్ బాల్ క్రికెట్ లో ఆడడం జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను రంజీ ట్రోఫీలో ఆడాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టు రాబోయే దేశీయ సీజన్ ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నాను. నేను అండర్-19, అండర్-23 క్రికెట్‌లలో చాలా రెడ్-బాల్ క్రికెట్ ఆడాను. కాబట్టి ఈ ఫార్మాట్ ఆడడం నాకు కొత్త విషయం కాదు. రంజీ ట్రోఫీ చాలా కఠినమైనది. పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మ్యాచ్‌లు ఉదయం ప్రారంభమవుతాయి. ఇది సవాలుతో కూడుకున్నది. రెండ్ బాల్ క్రికెట్ లో శుభ్‌మాన్ గిల్ నాకు ఆదర్శం" అని ఆర్య చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 లో అదరగొట్టిన ప్రియాంష్ ఆర్య ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒపెల్ కంటే ముందు ప్రియాంష్ ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేసి సంచలనంగా మారాడు. భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతులకు ఆరు సిక్సర్ల కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 39 బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ప్రియాంష్.. 50 బంతుల్లో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్య ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.