ప్రొ కబడ్డీ లీగ్‌‌లో యు ముంబా విజయం

V6 Velugu Posted on Jan 27, 2022


బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌‌ (పీకేఎల్‌‌)లో యు ముంబా ఐదో విక్టరీని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో యు ముంబా 45–34తో బెంగళూరు బుల్స్‌‌పై గెలిచింది. రైడర్‌‌ అభిషేక్‌‌ సింగ్‌‌ (11) యు ముంబా విక్టరీలో కీ రోల్‌‌ పోషించాడు. డిఫెండర్ రాహుల్‌‌ సేతుపాల్‌‌ (8), అజిత్‌‌ (8) అండగా నిలిచారు. బెంగళూరు టీమ్‌‌లో పవన్‌‌ షెరావత్‌‌ (14) చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. భరత్‌‌ (7), సౌరభ్‌‌ నందల్‌‌ (4) ఫర్వాలేదనిపించారు. తాజా విక్టరీ తర్వాత ముంబా టీమ్‌‌ 41 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌లో ఉంది. బుల్స్‌‌ టీమ్‌‌ 46 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉంది.

Tagged U Mumba, Pro Kabaddi PKL, Bengaluru Bulls

Latest Videos

Subscribe Now

More News