- యాదాద్రిలో 2,130 అప్లికేషన్లు
- సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన
- 70 నుంచి 80 మందికి హెడ్ మాస్టర్లు గా ప్రమోషన్?
- 30లోగా టాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తి
యాదాద్రి, వెలుగు : టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ యాదాద్రి జిల్లాలో ప్రారంభమైంది. గత ప్రభుత్వం టీచర్ల ప్రమోషన్లు, బదిలీల కార్యాచరణ సెప్టెంబర్2023లో చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో గెజిటెడ్హెచ్ఎం ట్రాన్స్ఫర్లు జరిగిన తర్వాత ప్రమోషన్లు వచ్చేసరికి హైకోర్టు ఆదేశాలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఆదేశాలు జారీ చేస్తూ షెడ్యూల్‌విడుదల చేయడంతో ఎడ్యుకేషన్ఆఫీసర్లు ప్రక్రియ
ప్రారంభించారు.
ట్రాన్స్ఫర్కోసం 2,130 మంది..
యాదాద్రి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్కలిపి 712 స్కూల్స్ఉన్నాయి. వీటిల్లో 3,465 టీచర్‌పోస్టులు ఉండగా, 2,800 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2,130 మంది ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల కోసం అప్లయ్చేసుకున్నారు. అప్లయ్ చేసుకున్నవారి సర్వీస్రిజిస్ట్రర్లనుఆఫీసర్లు పరిశీలించి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు సంబంధించి లెక్కలు తేలుస్తున్నారు. జిల్లాలో163 మంది గెజిటెడ్హెడ్మాస్టర్లకు 75 మంది పని చేస్తున్నారు.
ఈ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియలో దాదాపు 70 నుంచి 80 పోస్టులు భర్తీ అవుతాయని ఎడ్యుకేషన్డిపార్ట్మెంట్ఆఫీసర్లు చెబుతున్నారు. అదేవిధంగా 1,360 మంది స్కూల్‌అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 1,218 మంది పని చేస్తున్నారు. 142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రక్రియ కారణంగా 262 మంది ఎస్జీజీలు స్కూల్‌అసిస్టెంట్లుగా ప్రమోషన్పొందే అవకాశం ఉంది. 210 పండిట్పోస్టులకు 189 మంది వర్కింగ్‌లో ఉండగా, 21 ఖాళీగా ఉన్నాయి. 84 పీఈటీ పోస్టుల్లో 82 మంది వర్కింగ్‌లో ఉండగా, రెండు ఖాళీగా ఉన్నాయి. వీరిలో చాలా మందికి స్కూల్‌అసిస్టెంట్లుగా ప్రమోషన్రానుంది.
పాయింట్ల ఆధారంగా..
సీనియార్టీ ప్రకారం లభించే పాయింట్ల ఆధారంగానే ప్రమోషన్లు దక్కుతాయి. సీనియార్టీ కారణంగా ఎక్కువ పాయింట్స్వచ్చిన టీచర్‌కు ప్రమోషన్వచ్చిన తర్వాతే మిగిలినవారికి అవకాశముంటుంది. ఈ ప్రక్రియ కారణంగా హైస్కూల్స్‌లో ఏడు సబ్జెక్ట్‌లకు టీచర్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం భర్తీ చేయాలని ప్రపోజల్స్పంపించినట్టుగా ఆఫీసర్లు చెబుతున్నారు. షెడ్యూల్‌ప్రకారం ఈనెల22 నుంచి 30లోగా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రమోషన్లు, ట్రాస్స్ఫర్ ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతున్నందున ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని డీఈవో నారాయణరెడ్డి తెలిపారు.