బండ్లన్న స్ట్రాంగ్ కౌంటర్..నేను మేనేజ్మెంట్‌ కోటాతో పైకి రాలేదు..

బండ్లన్న స్ట్రాంగ్ కౌంటర్..నేను మేనేజ్మెంట్‌ కోటాతో పైకి రాలేదు..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) నిత్యం ఎదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులకు నెటిజన్స్ ఆయన్ని ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇక రీసెంట్గా 'పవర్ లేని వాళ్లకు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్' అంటూ బీఆర్ఎస్ పార్టీపై బండ్ల గణేష్ పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఆయనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు జోకర్‌, కమెడియన్‌ అంటూ కొందరు కామెంట్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా..వాటిపై స్పందించిన బండ్ల గణేష్..ఓ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు. బండ్లన్న వీడియో సందేశంతో మరింతగా హీట్‌ రాజుకున్నట్లు అయింది.

బండ్ల గణేష్ వీడియోలో మాట్లాడుతూ..నేను బతకడానికి హైదరాబాద్‌ వచ్చినప్పుడు.. ఇన్‌స్టిట్యూట్‌ అయిపోయాక షాద్‌ నగర్‌ తిరిగి వెళ్లి పోకుండా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ లో ఆఫీస్ బాయ్ గా పని చేశాను. ఈ విషయం నేను గర్వంగా చెప్పుకుంటా.. అక్కడ నుంచి అగ్ర నిర్మాత గా ఎదిగినందుకు చాలా గర్వంగా ఉంది. చిన్న చిన్న వేశాలు వేస్తూ సినీ జీవితాన్ని ముందుకు నడిపా..అంతేకానీ, నేను మేనేజ్మెంట్‌ కోటాలో లేను.

అలాగే మా నాన్నపేరు..సంస్థ పేరు, చివరికి నా పార్టీ పేరు కూడా ఎక్కడా చెప్పుకొను. అందుకే ఇపుడు కూడా గర్వంగా చెబుతున్న నాకు..నేనే బాసుని, నేనే రైతుని, శ్రామికుడిని, ఓనర్‌ ని..ఈరోజు నేనేమైనా..అది నాదే..  అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. అవును నేను సినిమాల్లో కమెడియన్‌ నే..నన్ను కమెడియన్‌ అన్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చురకలు అంటిస్తునే..చెప్పాల్సిన వాళ్లకు అదిరిపోయేలా సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి బండ్లన్న చేసిన కామెంట్స్ రాజకీయ నాయకులకి సంబంధించింది అయ్యి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకి ఎవరూ రియాక్ట్ అవుతారో చూడాలి మరి.