హార్ట్ వీక్‌‌ వాళ్లు ‘ఈషా’ చూడొద్దు.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో కొత్త మూవీపై బన్నీ వాస్‌ కామెంట్స్

హార్ట్ వీక్‌‌ వాళ్లు ‘ఈషా’ చూడొద్దు.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో కొత్త మూవీపై బన్నీ వాస్‌ కామెంట్స్

హారర్‌‌ థ్రిల్లర్‌‌  ‘ఈషా’ చిత్రం అందరినీ భయపెడుతుందని, హార్ట్‌‌ వీక్‌‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దని సినిమాను విడుదల చేస్తున్న బన్నీ వాస్‌‌, వంశీ నందిపాటి అన్నారు.

త్రిగుణ్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్‌‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించాడు. హెబ్బాపటేల్‌‌ హీరోయిన్‌‌. కేఎల్‌‌ దామోదర ప్రసాద్‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా నాలుగుసార్లు భయపడ్డా. ఎవరి డబ్బులూ వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్‌‌ ధర కూడా రీజనబుల్‌‌గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్‌‌ వీక్‌‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ అని చెప్పారు.

ఈ సినిమా చూశాక  ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నానని వంశీ నందిపాటి అన్నారు.  ఇదొక హారర్ థ్రిల్లర్ అని, ప్రతి  ఒక్కరినీ భయపెడుతుందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె,  నిర్మాత కేఎల్‌‌ దామోదర ప్రసాద్‌‌ అన్నారు.