
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(Original Gangstar). స్టైలీష్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఓజీ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో పవన్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇంతవరకు ఎప్పుడు కనిపించనంత స్టైలీష్ గా పవన్ కనిపిస్తుండటంతో.. ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకున్నారు.
ఇక అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. రిలీజ్ ఎప్పుడు అంటూ నిర్మాత దానయ్య కు సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ కూడా చేస్తున్నారట. దాంతో ఓజీ సినిమా రిలీజ్ పై తాజాగా స్పందించారు నిర్మాత దానయ్య. ఇందులో భాగంగా ఆయన ట్వీట్ చేశారు.. పుట్టినరోజు శుభాకాంక్షలతో మా సోషల్ మీడియా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ.. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. కాబట్టి.. అప్డేట్స్ ఇవ్వడం కోసం కాస్త సమయం పడుతుంది.. ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు.. అంటూ ట్వీట్ చేశారు దానయ్య. దానయ్య ఇచ్చిన ఈ ట్వీట్ తో పవన్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
Timeline is filled with birthday wishes. ?? Fans are Naturally Hungry. Just to let you know, we're not shooting now, so it will take a little more time to get updates. Don't stay tuned here.
— DVV Entertainment (@DVVMovies) December 12, 2023
ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే.. మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్ తదితరులు కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.