
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ 'OG'. సుజీత్(Sujeeth) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. సాహో (Sahoo) మూవీతో మంచి బజ్ క్రీయేట్ చేసిన సుజిత్..ఇప్పుడు పవర్ స్టార్తో OG (Orginal Gangstar) మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ మూవీలో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనుకున్నారు అంతా..కానీ, ఓజి అంటే 'ఓజాస్ గంభీర' అని తెలిసింది.ఇక ఈ పేరే టైటిల్గా పెడితే పవర్ ఫుల్గా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు అదిరిపోయేలా..టైటిల్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను నిర్మిస్తున్న DVV దానయ్య (Daanayya) బ్యానర్ కొత్తగా ‘హంగ్రీ చీతా’(Hungry Cheetah) అనే టైటిల్ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. ఇపుడు డీవీవీ దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసమనే చర్చ సోషల్ మీడియాలో సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు.
అయితే OG మేకర్స్ మాత్రం‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మరి OG సినిమా నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ దానయ్య ఫిక్స్ చేసిన హంగ్రీ చీతా అనే ఇంపాక్ట్ టైటిల్..ఎవరి ప్రాజెక్ట్ కోసమో తెలియాల్సి ఉంది.
దే కాల్ హిమ్ ఓజీ టైటిల్ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా..అనేది త్వరగా తేల్చండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ రెండు టైటిల్స్ చాలా ఇంటెన్స్గా, ఇంపాక్ట్గా ఉన్నాయి. మరి టైటిల్ విషయంలో త్వరలో క్లారీటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das), శ్రియ రెడ్డి (Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.