చిరంజీవి, రాజమౌళి ఏంచేశారో చెప్పాలి.. నట్టి కుమార్ సంచలన కామెంట్స్

చిరంజీవి, రాజమౌళి ఏంచేశారో చెప్పాలి.. నట్టి కుమార్  సంచలన కామెంట్స్

పస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన నంది అవార్డులపై అశ్వినీ దత్ చేసిన వ్యాకలను కూడా ప్రస్తావించాడు. -రాష్ట్రం రెండుగా విడిపోయాక ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదని, - రౌడీలకు, గూండాలకి అవార్డ్స్ ఇస్తున్నారని దత్తు గారు మాట్లాడింది వాస్తవమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా ఇండస్ట్రీని అగ్ర హీరోలు, నిర్మాతలు రోడ్డున పడేశారని, ప్రభుత్వం ముందు ఇండస్ట్రీని తాకట్టు పెట్టారని, - ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు అప్పుడు అమరావతిలో భూములు తీసుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

నిజంగా అవార్డుల గురించి అడగలనుకుంటే.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడగాలి. అలా అడిగే దమ్ముందా.  ఒకవేళ మాట్లాడినా..  అశ్విని దత్తు గారు టీడీపీ కోసం, పోసాని వైసీపీ కోసం మాట్లాడుతున్నారనే తప్పా.. ఇండస్ట్రీ కోసం కాదని అన్నారు.  పార్టీలకతీతంగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పనిచేయాలని,  ఎఫ్.డి.సి. చైర్మెన్  ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి మాట్లాడి ఇండస్ట్రి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.  టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని కలిసిన చిరంజీవి, రాజమౌళి ఇప్పటివరకు ఏమి చేశారో చెప్పాలన్నారు.  

భూములు తీసుకున్నా స్టూడియోల నిర్మాణం ఎందుకు జరగట్లేదని,  -స్టూడియోలు ఏర్పాటు చేస్తే మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2014 లో స్టూడియోల రెంట్ 20వేలు ఉంటే... ఇప్పుడది లక్షన్నర అయ్యిందని,- తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అని మాత్రమే అంటుంది కానీ చిన్న సినిమాలకి చేసేది ఏమి లేదని పేర్కొన్నారు. చిన్న, పెద్ద అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ అని,  కానీ 2014 నుంచి చిన్న సినిమా చచ్చిపోయిందన్నారు.  దాసరి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఎంతో చేశారు కానీ ఆయన చనిపోయాక ఎవరు పట్టించుకోలేదు. నివాళులు అర్పించడం తప్ప. ఇండస్ట్రీ కోసం - తెలంగాణ, ఆంద్రప్రదేశ్  ప్రభుత్వాలు ఏదైనా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో  పెద్దల్ని కలవలేక పోతున్నాని.. అందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు నట్టి కుమార్. ప్రస్తుతం నట్టి కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయ్యాంశం అయ్యాయి.