Sundeep Kishan SK30: సందీప్ కిషన్ కొత్త సినిమా..చిరు కోసం రాసిన కథే..కానీ! 

Sundeep Kishan SK30: సందీప్ కిషన్ కొత్త సినిమా..చిరు కోసం రాసిన కథే..కానీ! 

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) ఇటీవలే ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ విజయం అందించిన ఊపుతో మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు ఈ యంగ్ హీరో. 

దర్శకుడు త్రినాధరావు నక్కినతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు సందీప్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. #SK30 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ సినిమాకి కథపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా నిర్మాత రాజేష్ బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. 'ఈ సినిమా చిరంజీవి,డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేయాల్సిన సినిమానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయని జర్నలిస్ట్ అడగగా.. 

రైటర్ ప్రసన్నకుమార్ అండ్ కళ్యాణ్ కృష్ణ చిరంజీవి గార్ల సినిమాకి ఈ కథ వినిపించాడు. కానీ, ఇపుడు మేము పూర్తిగా దానికి డిఫరెంట్ వర్షన్ చేస్తున్నాం అని అన్నారు.  అపుడు ఉన్న స్క్రిప్ట్ కి ..ఇప్పుడు చేసే సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్సు ఉందని స్ప్రష్టం చేశారు.ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసి..డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

ఇక త్రినాధరావు ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా లాంటి భారీ హిట్ అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో సందీప్ కిషన్, త్రినాధరావు సినిమాపై ఇప్పటినుండే అంచనాలు ఏర్పడుతున్నాయి.