ఆధునిక పరిశోధనలకు ఇతిహాసాలే మూలం : డీబీ రామాచారి

ఆధునిక పరిశోధనలకు ఇతిహాసాలే మూలం : డీబీ రామాచారి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: ఆధునిక పరిశోధనలకు ప్రాచీన ఇతిహాసాలు, సంస్కృతే మూలమని హైదరాబాద్​యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ కెమిస్ర్టీ ప్రొఫెసర్​, ప్రముఖ ఆర్గానిక్​ కెమిస్ర్టీ సైంటిస్ట్​ దేవలపల్లి రామాచారి అన్నారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీలో స్వామినాథన్​ కీటోన్​ థియరీపై మంగళవారం వర్క్​షాప్​ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాచారి మాట్లాడుతూ భూమిపై జీవం ఉన్నంత వరకు ఆర్గానిక్​ కెమిస్ర్టీ ఉంటుందన్నారు. 

స్వామినాథన్​ కీటోన్స్ సిద్ధాంతంలో ముందుగా ఆయన 1966 లో బైసైక్లో అండేకేన్​ అనే అస్థిపంజరాలను కనుగొన్నారని, నేడు అవే అల్కలాయిడ్ల సింథాన్లుగా పనిచేస్తున్నాయన్నారు. మహాభారతంలోని తిరిగే చేప కన్నుపై గురి పెట్టిన అర్జునుడి విన్యాసం యాన్యులేషన్​ థియాబిసైక్లోనోనేన్ల సారూప్యతను నిరూపిస్తుందని వివరించారు. సైక్లో ఆక్టేన్ల సంశ్లేషణను కూడా రామసేతు నిర్మాణంతో పోల్చిన రామాచారి పరమాణు చట్రాల కచ్చితత్వాన్ని ఉదహరించారు. అనంతరం పలువురు స్టూడెంట్స్​ తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.