కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా

కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా

దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతామని స్పష్టం చేశారు. కేంద్రానికి పేదల వ్యతిరేక బడ్జెట్ అయితే రాష్ట్రానికి రైతు బడ్జెట్ అని అన్నారు. అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్ళేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని ప్రశంసించారు. బడ్జెట్ లో రైతు బంధు, దళిత బంధు, విద్య, వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని అన్నారు. ఐటీ రంగంలో ఏడాదికి లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రమే నిధులు కేటాయించాల్సి ఉన్నా సగం ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు.