నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 18 వరకు నిషేధాజ్ఞలు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 18 వరకు నిషేధాజ్ఞలు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు:  మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసేదాకా ఈనెల 18 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్​, ఆలూర్​, బాల్కొండ, భీంగల్​, డొంకేశ్వర్​, కమ్మర్​పల్లి, మెండోరా, మోర్తాడ్​, ముప్కాల్​, నందిపేట, వేల్పూర్​, ఎర్గెట్ల మండలాల్లో నిషేదాజ్ఞలు కొనసాగుతాయన్నారు. దీని ప్రకారం ఐదుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి ఉండరాదన్నారు. లా అండ్​ ఆర్డర్​ రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, లేకుంటే  యాక్షన్​ తీసుకుంటామన్నారు.