వారాల ఆనంద్​కు..సాహిత్య అకాడమీ అవార్డు

వారాల ఆనంద్​కు..సాహిత్య అకాడమీ అవార్డు

న్యూఢిల్లీ/కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కు చెం దిన ప్రముఖ కవి, రచయిత వారాల ఆనంద్ కు  అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రముఖ ఉర్దూ, పంజాబీ కవి గుల్జార్ రాసిన ‘గ్రీన్ పోయెమ్స్’ ను...  పవన్‌ కే వర్మ ఆంగ్లానువాదం చేయగా ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ–2022 అవార్డులకు సంబంధించి  కవితలు, అనువాద విభాగాల్లో పురస్కారాలను గురువారం కేంద్రం ప్రకటించింది. ట్రాన్స్ లేషన్ విభాగంలో వారాల ఆనంద్ రాసిన ఆకుపచ్చ కవితలు పుస్తకానికి అవార్డు దక్కింది. గుల్జార్.. హిందీలో రాసిన గ్రీన్ పోయెమ్స్​లో 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే ఉన్నాయి. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో సూటిగా చెప్పారు. వేములవాడలో పుట్టిన ఆనంద్, కరీంనగర్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు, కథలు రాయడం ఆనంద్​కు అలవాటు. మొత్తం 17 భాషల్లో ట్రాన్స్​లేషన్​లకు సంబంధించి అవార్డులను ప్రకటించింది. విజేతలకు రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందించనున్నారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సినారె సహా ఇప్పటి వరకు ఐదుగురికి కేంద్ర సాహిత్య అవార్డులు రాగా, ఈ ఏడాదే రెండు కేటగిరీల్లో ఈ గౌరవాన్ని జిల్లా కవులు దక్కించుకున్నారు. సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్ బాలసాహిత్యంలో అవార్డు దక్కించుకోగా, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ ఎంపికయ్యారు. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిధుల నుంచి సమాచారం అందగానే ఆనంద్​ అభిమానులు, సాహితీ వేత్తలు ఆయనకు పోటాపోటీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నరేంద్ర రాసిన నవలకు అవార్డు

ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మధురాంతకం నరేంద్ర రాసిన ‘‘మనో ధర్మపరాగం’’నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరిం చింది. మొత్తం 23 భాషల్లోని నవలలకు అవార్డు లు ప్రకటించారు. ఇందులో ఏడు పద్యాలు, 6 నవలలు, 2 చిన్న కథలు, మరో ఐదు ఇతర వి భాగాల్లో రాసిన పుస్తకాలను ఎంపిక చేశారు. ఎం పికైన నవల విజేతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రంతో సత్కరించనున్నట్లు సాహిత్య అకాడమీ తెలిపింది. త్వరలోనే వీటిని అందిస్తామన్నారు.