అన్యాయం చేస్తున్న సర్కారు.. బతుకమ్మ ఆడుతూ ఏఎన్‌ఎంల నిరసన

అన్యాయం చేస్తున్న సర్కారు.. బతుకమ్మ ఆడుతూ ఏఎన్‌ఎంల నిరసన

నల్గొండ అర్బన్, వెలుగు: కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసిన రెండో ఏఎన్ఎంలకు సర్కారు అన్యాయం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.  కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన సమ్మె బుధవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది.  ఈ సందర్భంగా రెండో ఏఎన్‌ఎంలు బతుకమ్మ ఆడి  పాటల రూపంలో తమ బాధలను ప్రభుత్వానికి తెలియజేశారు.

అనంతరం దేవేందర్‌‌ రెడ్డి మాట్లాడుతూ 16 ఏళ్లుగా పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంను పర్మినెంట్‌ చేయకుండా కొత్తపోస్టుల కోసం నోటిఫికేషన్ వేయడం సరికాదన్నారు. వెంటనే నోటిఫికేషన్  రద్దు చేసి.. అందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ. రెండో ఏఎన్‌ఎంల యూనియన్ నేతలు వెంకటేశ్వర్లు,  రత్నకుమారి, నర్సమ్మ, నాగమణి, వసంత, సుశీల, గీతరాని, అరుణ, మాధురి, భూదేవి, అండాలు, సరళ, శకుంతల, ఇందిరా, సుచిత్ర, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ  తదితరులు పాల్గొన్నారు.