
న్యూఢిల్లీ: స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఎస్‌ఎం రీట్) ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, తన రెండో ఎస్‌ఎం రీట్ స్కీమ్ అయిన ప్రాప్‌షేర్ టైటానియా లాంచ్ చేసేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్ దాఖలు చేసింది. ఈ ఐపీఓ సైజ్ రూ.472 కోట్లు. ఈ పబ్లిక్ ఇష్యూలో టైటానియా యూనిట్ల ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంటుంది. ప్రాప్‌షేర్ టైటానియా కింద ముంబైలోని జీ కార్ప్ టెక్ పార్క్‌లో 4,37,973 చదరపు అడుగుల గ్రేడ్ ఏ+ ఆఫీస్ స్పేస్ ఉంటుంది. ఇందులో ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఎంఎన్‌సీలు, ఆదిత్య బిర్లా క్యాపిటల్, కాన్సెంట్రిక్స్ వంటి బ్లూ-చిప్ కంపెనీలు రెంట్‌కు ఉన్నాయి.
ఈ బిల్డింగ్‌లో టెనెంట్లు 9 సంవత్సరాలకు పైగా ఉన్నారని, సగటున 3.3 సంవత్సరాల లీజ్ ఎక్స్‌పైరీ ఉందని ట్రస్ట్ చెప్పింది. అన్ని టెనెంట్ లీజ్ అగ్రిమెంట్లలో రెంట్‌ను ఏడాదికి 5 శాతం పెంచుకోవచ్చనే క్లాజ్ ఉంది. ప్రాప్‌షేర్ టైటానియా యూనిట్లు కొన్న ఇన్వెస్టర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి 9 శాతం రిటర్న్ పొందుతారని అంచనా. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే ఫండ్స్‌ను ఆస్తి కొనుగోలు కోసం ఉపయోగించాలని ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ చూస్తోంది.