వచ్చే ఏడాది జియో ఐపీఓ... 10 శాతం వాటా అమ్మే అవకాశం

వచ్చే ఏడాది జియో ఐపీఓ... 10 శాతం వాటా అమ్మే అవకాశం
  • కంపెనీ వాల్యుయేషన్ రూ.13 లక్షల కోట్లు ఉంటుందని అంచనా
  • ఏఐ బిజినెస్‌‌‌‌ కోసం సపరేట్‌‌‌‌ సబ్సిడరీ
  • రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ వెల్లడి

న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో, వచ్చే ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కి వస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్  ముకేశ్ అంబానీ ప్రకటించారు. “జియో ఐపీఓ కోసం  అన్ని అనుమతులు పొందేందుకు  ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇన్వెస్టర్ల ముందుకొస్తాం” అని  రిలయన్స్ ఇండస్ట్రీస్  యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌ (ఏజీఎం)లో   అంబానీ తెలిపారు.  

జియో గత పదేళ్లలో  50 కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది.  మార్కెట్ అంచనాల ప్రకారం, 10 శాతం వాటాను ఐపీఓ ద్వారా  విక్రయించే అవకాశం ఉంది. జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు  66.3శాతం వాటా ఉంది. మెటా (ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌)కు  10శాతం, గూగుల్‌‌‌‌‌‌‌‌కు  7.7శాతం, కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీపీసీ వంటి  ప్రైవేట్ ఈక్విటీ  ఇన్వెస్టర్లందరికి కలిపి 16 శాతం వాటా ఉంది. జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్   గతంలో 13 పెద్ద  ఇన్వెస్టర్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లను సేకరించిన విషయం తెలిసిందే.

హిస్టరీలో అతిపెద్ద ఐపీఓ!

బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ రిపోర్ట్ ప్రకారం,  జియో ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ విలువ  136 బిలియన్ డాలర్ల (రూ.11 లక్షల కోట్ల)   నుంచి 154 బిలియన్ డాలర్ల (రూ.13 లక్షల కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. ఈ విలువ ఆధారంగా, జియో ప్రపంచంలో ఆరో అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలుస్తుంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఇండియాలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.  

ఈ ఏడాది ఆగస్టు నాటికి టీమొబైల్ యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా మొబైల్, ఏటీ అండ్ టీ, వెరిజోన్‌‌‌‌‌‌‌‌, డచ్‌‌‌‌‌‌‌‌టెలికం వంటి టెలికాం కంపెనీలు జియో కంటే ముందున్నాయి.  ఈ కంపెనీ మొబైల్, హోమ్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడంపై దృష్టి సారించింది.  జియో స్మార్ట్‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌, జియోటీవీ+, జియోటీవీ ఓఎస్‌‌‌‌‌‌‌‌, ఆటోమేషన్  వంటి డిజిటల్ సేవలను ప్రతి ఇంటికి తీసుకెళ్లనుందని అంబానీ అన్నారు. ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈలు, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ల కోసం సులభమైన,  సురక్షిత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ను అందించనుందని అన్నారు.

రిలయన్స్ ఏజీఎం హైలైట్స్​

ప్రతి ఒక్కరికీ, ప్రతి చోట ఏఐ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు అందివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముకేశ్ అంబానీ అన్నారు. ఏఐ బిజినెస్‌‌‌‌‌‌‌‌ కోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కంపెనీ  జామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ (గుజరాత్‌‌‌‌‌‌‌‌) లో గిగావాట్- సామర్ధ్యం ఉన్న , ఏఐతో పనిచేసే -డేటా సెంటర్లను నిర్మిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ మెటా, గూగుల్‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. రూ.855 కోట్లతో మెటాతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది. గూగుల్ క్లౌడ్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా పనిచేసే జామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లౌడ్ రీజియన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది.  
    
‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫాజిల్ ఇంధనాల (పెట్రోలియం వంటివి)  నుంచి క్లీన్ఎనర్జీ (సోలార్, విండ్ ఎనర్జీ వంటివి) వైపు మళ్లుతోంది. వచ్చే ఏడాదిలో మెగా బ్యాటరీ ఫ్యాక్టరీ, సింగపూర్ కంటే మూడు రెట్లు పెద్ద సోలార్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తాం.  2032 నాటికి 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్ధ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం”అని ముకేశ్ అంబానీ అన్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో  వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర కేటగిరీల్లో విస్తరిస్తామని చెప్పారు. 

జియో స్మార్ట్‌‌ గ్లాసెస్‌‌తో ఫొటోలు

రిలయన్స్ జియో తన 48వ ఏజీఎంలో జియోఫ్రేమ్స్‌‌ అనే ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను పరిచయం చేసింది. ఇవి మెటా స్మార్ట్ గ్లాసెస్‌‌తో పోటీ పడనున్నాయి.  భారత మార్కెట్‌‌కు తగ్గట్టు దీనిని రూపొందించారు. జియోఫ్రేమ్స్‌‌ ద్వారా వినియోగదారులు హెచ్‌‌డీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. జియోఏఐ క్లౌడ్స్‌‌కు లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు.  మల్టీలాంగ్వేజ్ వాయిస్ అసిస్టెంట్, ఓపెన్- ఇయర్ స్పీకర్లు, కాల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

జియో పీసీ

రిలయన్స్ జియో సెటాప్‌‌ బాక్స్‌‌తో ఏదైనా టీవీని  పర్సనల్ కంప్యూటర్ (పీసీ) గా మార్చుకోవచ్చు. జియో పీసీ సర్వీస్‌‌ను  జియో చైర్మన్‌‌ ఆకాశ్  అంబానీ ప్రకటించారు. కస్టమర్లు జియో సెటాప్‌‌  బాక్స్‌‌ను స్క్రీన్‌‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఏదైనా టీవీని ఏఐ -రెడీ కంప్యూటర్‌‌గా మార్చుకోవచ్చన్నారు. కీబోర్డ్ కనెక్ట్ చేస్తే, జియో క్లౌడ్‌‌ ఆధారంగా వర్చువల్ పీసీ  రెడీ అవుతుందని చెప్పారు.  ముందస్తు పెట్టుబడి అవసరం లేదు. ఉపయోగించినంతకు మాత్రమే చెల్లించాలి. ఇది ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది.   మెమరీ, స్టోరేజ్, పవర్‌‌ను రిమోట్‌‌గా అప్‌‌గ్రేడ్ చేయొచ్చు.