కరీంనగర్ జిల్లా : పురుగుమందు డబ్బాలతో ట్యాంక్ ఎక్కి నిరసన..కెనాల్ రద్దు చేయాలని రైతుల డిమాండ్

కరీంనగర్ జిల్లా : పురుగుమందు డబ్బాలతో ట్యాంక్ ఎక్కి నిరసన..కెనాల్ రద్దు చేయాలని రైతుల డిమాండ్

తిమ్మాపూర్/ చిగురుమామిడి, వెలుగు: ఎల్-21 కెనాల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి రైతులు సోమవారం ఆందోళనకు చేపట్టారు. చేతిలో పురుగుమందు డబ్బాలు పట్టుకొని, గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. కెనాల్ ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్వో కనకయ్య స్థానిక ఎస్సై, సర్పంచ్ తో కలిసి వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని వారికి నచ్చజెప్పి కిందకు దించారు.