న్యాయం చేయాలంటూ..పీఆర్ఎల్ఐ ముంపు బాధితుల నిరసన

న్యాయం చేయాలంటూ..పీఆర్ఎల్ఐ ముంపు బాధితుల నిరసన
  •  120 జీవో ప్రకారం ఇవ్వాలని డిమాండ్​     
  • డబుల్​ఇండ్లు కట్టించి తరలించాలని విజ్ఞప్తి

కొల్లాపూర్, వెలుగు :  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన ధూళ్యా నాయక్​ తండా, వడ్డె గుడిసెలు, అంజనగిరి సున్నపు తండా వాసులు తమకు పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం ధూళ్యానాయక్ పంచాయతీ ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమకు గతంలో పాత జీవో 123 ప్రకారం పరిహారం డబ్బులు చెల్లించారని, మరో ప్రాంతంలో మాత్రం జీవో నంబర్ 120 తీసుకువచ్చి అక్కడివారికి పరిహారం ఇచ్చారన్నారు.

ALSO READ: 26లోగా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను నియమించాల్సిందే : రాష్ట్ర సర్కార్​కు తేల్చి చెప్పిన హైకోర్టు 

దీనివల్ల తాము నష్టపోయామని, తమకు కూడా120 జీవో ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్​చేశారు. ముంపుకు గురవుతున్న తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని అప్పట్లో సీఎం చెప్పాడని, కానీ ఆ హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టులు కడితే మంచిదేనని, తమ బతుకుల సంగతి ఏమిటని ప్రశ్నించారు.  నిర్వాసితులకు న్యాయం చేయకుండానే సీఎం కేసీఆర్ ​ప్రారంభోత్సవానికి రావడం కరెక్ట్​ కాదన్నారు. తక్షణమే తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.