పర్మినెంట్ చేయాలంటూ కాంట్రాక్ట్​ ఉద్యోగుల ధర్నా

పర్మినెంట్ చేయాలంటూ కాంట్రాక్ట్​ ఉద్యోగుల ధర్నా

ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కదం తొక్కారు. జోరు వాన లెక్క చేయకుండా శంషాబాద్​ మండల కార్యాలయం వద్ద ఆందోళన కు దిగారు. వారు మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో తమ డిపార్ట్​మెంట్ వారిని ఆయా ప్రభుత్వాలు పర్మినెంట్​ చేయగా బీఆర్​ఎస్​ మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. 

అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు వ్యవస్థే ఉండకూడదని చెప్పిన సీఎం కేసీఆర్​ ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. చాలి చాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకోస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు.