ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
  •    ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఫేక్ డిజేబులిటీ సర్టిఫికెట్ సమర్పించినట్లు  నిర్ధారణ!
  •     ఎంబీబీఎస్ సీటు కోసం కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన ఖేద్కర్
  •     రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో పూజ తల్లిపై కేసు నమోదు
  •     పోలీసులను తప్పించుకు తిరుగుతున్న పేరెంట్స్

ముంబై : మహారాష్ట్ర పుణెలో పనిచేస్తున్న ట్రైయినీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ పూజా ఖేద్కర్‌‌‌‌‌‌‌‌(34) కు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సివిల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ జాబ్ పొందేందుకు ఆమె ఫేక్ డిజేబులిటీ సర్టిఫికెట్ సమర్పించినట్లు వస్తున్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. తనకు మానసికంగా, శారీరకంగా ఎలాంటి లోపం లేకున్నా పూజా ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ 2022లో మెడికల్ డిజేబులిటీ సర్టిఫికెట్ కోసం అప్లై చేశారని దర్యాప్తులో తేలింది.

 పూజా ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ ముందుగా తనకు లోకోమోటర్ డిజేబులిటీ (కండరాలకు సంబంధించిన వ్యాధి) ఉన్నదని దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలని పుణెలోని ఔంద్ హాస్పిటల్ ను ఆమె కోరారు. ఆస్పత్రి మేనేజ్ మెంట్ తిరస్కరిస్తూ ఈమెయిల్ చేసింది. దీంతో ఆమె అహ్మద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని జిల్లా సివిల్ హాస్పిటల్ నుంచి తీసుకున్న డిజేబులిటీ సర్టిఫికెట్​ను ప్రొడ్యూస్ చేసినట్లు తేలింది.

 ఐఏఎస్ ఎంపిక ప్రక్రియలో భాగంగా 2023లో  డిజేబులిటీని నిర్ధారించడానికి మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులకు పూజ డుమ్మా కొట్టారు. ఆరోసారి కూడా ఆమె విజువల్​కు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షకు హాజరు కాలేదు. మెడికల్ టెస్టులు పూర్తి చేయకున్నా.. ఖేద్కర్​ను ఎలా సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఎంబీబీఎస్ సీటు కోసం కూడా..

పూజ ఎంబీబీఎస్ చదివేందుకు కూడా ఫేక్ సర్టిఫికెట్లు వాడినట్లు తెలుస్తోంది. ఆమె 2007లో ఓబీసీ నాన్-క్రిమీలేయర్ కోటాను ఉపయోగించి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందారు. అయితే, పూజ తండ్రి దిలీప్ ఖేద్కర్ మాజీ బ్యూరోక్రాట్, పైగా ఆయన పేరుతో రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీంతో పూజకు నాన్​క్రిమీలేయర్ కోటా వర్తించదు. 2007లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ మహారాష్ట్ర పరీక్ష రాసి పూజ ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ 200 మార్కులకు 146 మార్కులు సాధించారు. నాన్​క్రిమీలేయర్ సర్టిఫికెట్​తో పుణెలోని కాశీబాయి నావేల్ కాలేజీలో సీటు తెచ్చుకున్నారు.

పరారీలో  పూజ ఖేద్కర్ పేరెంట్స్

ఇటీవల రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్  ఖేద్కర్ ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి తాళంవేసి ఉండడంతో వెను తిరిగారు.

కమిటీకి నా వర్షన్ వివరిస్తా: పూజ

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ముందు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెబుతానని ట్రైయినీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ పూజ  ఖేద్కర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. నిజం గెలుస్తుందని తెలిపారు. సోమవారం ఆమె అని వాషిమ్‌‌‌‌‌‌‌‌లో విలేకరులతో మాట్లాడారు. "కమిటీ ముందు నేను వాంగ్మూలం ఇస్తాను. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను. 

ప్రొబేషనర్‌‌‌‌‌‌‌‌గా పనిచేయడం నేర్చుకోవడమే నా పని. అదే నేను చేస్తున్నాను. దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. నేను తప్పు చేసి ఉంటే నిర్ణయించాల్సింది మీడియా కాదు. అది ప్రభుత్వ కమిటీ పని. విచారణ కూడా జరగకుండానే నన్ను దోషిగా చూపించడం మాత్రం కచ్చితంగా తప్పే. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయి" అని పూజ పేర్కొన్నారు.