ముఖ్యమైన రంగాలకు కేటాయించిన బడ్జెట్…

ముఖ్యమైన రంగాలకు కేటాయించిన బడ్జెట్…

2 గంటల 40 నిమిషాల సేపు సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్. స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో చివరి రెండు పేజీలను చదవకుండానే ప్రసంగం ముగించారు. ఇన్​కం టాక్స్​ చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు.. పాత శ్లాబుల​తో పాటు కొత్త శ్లాబు​ల ప్రకటన. ట్యాక్స్​ పేయర్లే ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం. కొత్త స్లాబ్​లో 70 శాతం మినహాయింపుల తొలగింపు. బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్​ కవరేజీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు. ట్రాన్స్‌‌‌‌​పోర్ట్​ రంగంలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​కు రూ.1.7 లక్షల కోట్ల కేటాయింపు. ఉడాన్​ స్కీమ్​కు ప్రోత్సాహం కలిగించేలా 2024 నాటికి దేశంలో మరో 100 ఎయిర్​ పోర్ట్​ల అభివృద్ధికి చర్యలు. ఇంటర్నేషనల్, నేషనల్​ రూట్లలో కృషి ఉడాన్​ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు. బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్​ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు రూ.18,600 కోట్లు.

 నాన్​ గెజిటెడ్​ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఇకపై ఒకే పరీక్ష. ఇందు కోసం నేషనల్​ రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 తేజస్​ రైళ్లు. పర్యాటక కేంద్రాలతో  లింకింగ్. రైల్వే ట్రాక్​లకు రెండువైపులా సోలార్​ కేంద్రాలు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్​ హాలీడే. కంపెనీలపై డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​ రద్దు. దీనిపై పన్నును రిసీవర్లే చెల్లించాలి. రూ.5 కోట్ల టర్నోవర్​ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్​ మినహాయింపు. ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్​ఐసీలో వాటాల విక్రయం. స్టాక్​ మార్కెట్​లో లిస్టింగ్.​ స్టాక్​మార్కెట్​లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం. పారిస్​ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు. సిటీల్లో ఎయిర్‌‌‌‌ పొల్యూషన్​ కంట్రోల్​ కోసం రూ.4,400 కోట్లు. హెరిటేజ్​ పరిరక్షణకు ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెరిటేజ్​ అండ్​ కన్జర్వేషన్​ ఏర్పాటు. లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్​ కనెక్టివిటీ. నేషనల్​ గ్రిడ్​తో లక్ష గ్రామాల అనుసంధానం

ఇండియాలో చదవాలనుకునే విదేశీ స్టూడెంట్ల కోసం స్టడీ ఇన్​ ఇండియా ప్రోగ్రాం.. ఇండ్​ శాట్. త్వరలో కొత్త ఎడ్యుకేషనల్​ పాలసీ ప్రకటన. వ్యవసాయ రంగం అభివృద్ధికి 16 సూత్రాల పథకం. సోలార్​ పంప్​ సెట్ల స్కీమ్​ మరో 20 లక్షల మంది రైతులకు వర్తింపు. పాలు, మాంసం, చేపల వంటి వాటి రవాణా కోసం కిసాన్ రైలు. కాశ్మీరీ కవి పండిట్​ దీనానాత్​ కౌల్​ నదీమ్, కవితలు, భక్తురాలు అవ్వయార్ సూక్తులు, తిరువళ్లువర్ రచనల్లోని ఐదు లక్షణాలు, మహాకవి కాళిదాసు రాసిన వాక్యాల ప్రస్తావన. నేషనల్​ పోలీస్​ యూనివర్సిటీ, నేషనల్​ ఫోరెన్సిక్​ సైన్సెస్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

దేశంలో మొబైల్​ఫోన్లు, ఎలక్ట్రిక్​ వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పథకం.  ఒక మేజర్​ పోర్ట్​ను కార్పొరేటైజ్​ చేసేందుకు సన్నాహాలు.  వచ్చే మూడేళ్లలో పాత విద్యుత్​ మీటర్ల స్థానంలో ప్రిపెయిడ్‌‌‌‌ స్మార్ట్​ మీటర్లు ఏర్పాటు. దీని ద్వారా తమకు కావాల్సిన సప్లయర్​ను కన్స్యూమర్​ ఎంపిక చేసుకునే అవకాశం. అమ్మాయిల మ్యారేజ్​ ఏజ్​పై సూచనల కోసం టాస్క్​ఫోర్స్​ ఏర్పాటుకు ప్రతిపాదన.