
నిర్మల్, వెలుగు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్య క్షుడు చక్రాల హరిప్రసాద్ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ భవనంలో పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా కార్యనిర్వహక సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో కింద స్థానికత, మెడికల్, స్పౌజ్‌లతో కేటగిరీలో మిగిలిపోయిన వారికి వెంటనే బదిలీలు చేయాలని కోరారు. శంకర్, రవి రాజ్, చంద్ర కాంత్, రాజేశ్వర్, నర్సయ్యతో పాటు తదితరులున్నారు.