బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని పబ్లిక్ అనుకుంటున్నరు : రవీంద్రనాయక్

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని పబ్లిక్ అనుకుంటున్నరు : రవీంద్రనాయక్

 హైదరాబాద్, వెలుగు : తమ ఎమ్మెల్యేలు మేడిగడ్డ టూర్ కు వెళ్లకపోవటం కరెక్ట్ కాదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్  అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అభిప్రాయం పబ్లిక్ లో ఉందని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో రవీంద్ర నాయక్ మీడియాతో చిట్ చాట్ చేశారు.  కేసీఆర్ పై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోదని, తీసుకుంటే అది తమకే నష్టమని వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో నల్గొండ టికెట్ అడుగుతున్నానని , గతంలో ఆ ప్రాంతంలో మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. పార్టీలో తనను ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లోనూ తన సలహాలనూ బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకోలేదని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు.