ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు

ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు

యాంటీజెన్ పై ఇంట్రెస్ట్ చూపని జనం
సెంటర్లకి వెళ్తే తిప్పి పంపుతున్న అధికారులు
మొబైల్ టెస్టింగ్ సెంటర్లతో ఊరట
అవేర్నెస్ కల్పించి, వెహికల్స్ సంఖ్య పెంచితే ఉపయోగం

హైదరాబాద్, వెలుగు: సిటీలో కరోనా సస్పెక్టర్స్ ఆర్టీపీసీఆర్ టెస్టుల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ పక్కాగా ఉండడంతో సెంటర్లకు క్యూ కడుతున్నారు. యాంటీజెన్ టెస్ట్ చేసుకున్న వాళ్లలో నెగెటివ్ వచ్చినా ఆందోళన వీడడం లేదు. ఈ టెస్టులో నెగెటివ్ వచ్చినా, ఆర్టీపీసీఆర్ లో కొందరికి పాజిటివ్ వస్తుండడంతో మళ్లీ ఆ సెంటరకే వెళ్తున్నారు. గ్రేటర్ పరిధిలో 9 సెంటర్లలోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఫ్రీగా చేస్తున్న అధికారులు.. యాంటీజెన్ టెస్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. గంటలోనే రిజల్ట్ వస్తుండడంతో అదే చేయించుకోవాలని జనానికి సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ సెంటర్లకు వెళ్లినా తిప్పి పంపిస్తున్నారు. దాంతో వారం కిందట వెరా హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ కలెక్ట్ చేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వెహికల్స్ వద్దకి సస్పెక్టర్స్ పరుగులు తీసున్నారు. మొన్నటి దాకా గ్రేటర్ పరిధిలో 5 వెహికల్స్ ద్వారా శాంపిల్స్ తీసుకోగా, బుధవారం మరో మూడు పెంచారు.

ఆర్టీపీసీఆర్ తో పక్కా రిజల్ట్…
కరోనా వైరస్ మొదలైనప్పడు గాంధీ, ఆయుర్వేద, నేచర్‌‌క్యూర్‌‌, చెస్ట్, ఫీవర్ హాస్పిటల్ సెంటర్లలో ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులు ఎక్కువగా చేశారు. రిజల్ట్ 85 శాతం వరకు పక్కాగా ఉండడంతోపాటు చిన్నపాటి సింప్టమ్స్ ఉన్నా పాజిటివ్‌‌ వచ్చేది. రిపోర్ట్ రావడానికి రెండ్రోజులు టైమ్ పట్టినా సస్పెక్టర్స్ వెంటనే డాక్టర్లను కన్సల్ట్ అయి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్లు. అలా 95 శాతం మంది కోలుకునేవారు. నెల నుంచి సిటీలో ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులను దాదాపు బంద్ పెట్టారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌‌, ఫీవర్‌ ‌హాస్పిటల్, సీసీఎంబీ, ఐపీఎం,ఈఎస్ఐ, డీఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్, లాలాగూడ రైల్వే హాస్పిటల్లోనే చేస్తున్నారు. గతంలో ఫీవర్‌ ‌హాస్పిటల్లో డైలీ 100-–150 టెస్టులు చేయగా, ఇప్పుడు అయిదారు మాత్రమే చేస్తున్నారు. మిగతా హాస్పిటల్స్లో రికమండేషన్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఒక్కో మొబైల్ వెహికిల్లో డైలీ 150కిపైగా..
కొత్త ఏర్పాటు చేసిన మొబైల్ టెస్టింగ్ సెంటర్లలో ఒక్కో వెహికల్ డైలీ 150 –200 శాంపిల్స్ కలెక్ట్ చేస్తోంది. వాటిని ఉస్మానియా, గాంధీ తదితర సెంటర్లకు పంపిస్తున్నారు. డైలీ ఒక్కో వెహికల్ ఒక్కో జోన్లోని రెండు, మూడు ఏరియాల్లో టెస్టులు చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సెంటర్లకు వెళ్లలేని వారు వెహికిల్ దగ్గరికి పోతున్నారు. యాంటీజెన్లో నెగెటివ్ వచ్చిన వాళ్లు కూడా టెస్ట్ చేయించుకుంటున్నారు. 48 గంటల్లోనే మొబైల్ నెంబర్ కి రిజల్ట్ మెసేజ్ వస్తోంది. కాగా, కొందరికి అవగాహన లేకపోవడం వల్ల మొబైల్ వెహికల్స్లోనూ యాంటీజెన్ టెస్టులే చేస్తున్నారని అనుకుంటున్నారు. వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వెహికల్స్ సంఖ్య పెంచితే ఉపయోగకరంగా ఉంటుంది.

For More News..

టెన్షన్లకి చెక్ పెట్టండిలా..

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్