ఆర్కేపీ ఓసీపీ ఫేజ్-2 విస్తరణకు డిసెంబర్ 3న పబ్లిక్ హియరింగ్

ఆర్కేపీ ఓసీపీ ఫేజ్-2 విస్తరణకు  డిసెంబర్ 3న  పబ్లిక్ హియరింగ్
  •     ఇండ్లు కోల్పోయి ఇబ్బందులు పడతామంటున్న స్థానికులు
  •     సభకు వచ్చి తమ అభిప్రాయాలు తెలపాలన్న మందమర్రి ఏరియా జీఎం  

కోల్​బెల్ట్,వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​ కాస్ట్​ ఫేజ్–-2 విస్తరణ మైన్​ను చేపట్టేందుకు సింగరేణి  సిద్దమైంది. పర్యావరణ పర్మిషన్​కోసం బుధవారం పబ్లిక్​హియరింగ్​సభ నిర్వహిస్తుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్​బోర్డు నిజామాబాద్​రీజియన్​ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు రామకృష్ణాపూర్​ ఓసీపీ ఓబీ క్యాంప్ ఆఫీస్​ఆవరణలో పబ్లిక్​ హియరింగ్ జరగనుంది. మైన్ లో మిగిలిన 32.67 మిలియన్​టన్నుల బొగ్గును వెలికితీసేందుకు ఫేజ్​-–2 ఎక్స్​టెన్షన్​ప్రక్రియ చేపడుతుంది. గని ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు మందమర్రి ఏరియా మరింత పురోభివృద్ధి చెందనుంది. 

ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని  సింగరేణి పేర్కొంటుంది. అటవీ భూముల్లోని ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి కోరుతూ సింగరేణి ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.  పర్మిషన్ వస్తే వచ్చే ఆర్థికసంవత్సరం జూన్​నుంచి ఆర్కేపీ ఓసీపీ ఫేజ్​–-2 విస్తరణ గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతుంది. మరోవైపు ఆర్కేపీ ఓసీపీ విస్తరణతో తమ ఇండ్లను కోల్పోతా మని, మైనింగ్​కార్యకలాపాలతో దుమ్ము, ధూళి వ్యాపించి అనారోగ్యాల బారినపడతామని ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలైన ఆర్కే–4 గడ్డ,శాంతినగర్,సర్దార్ వల్లబాయ్​నగర్​, మూడో వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఓసీపీ ఫేజ్–​-1 సమయంలోనే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లను తీసుకొని ఆర్అండ్ఆర్, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్​చేస్తున్నారు. 

ఆర్కేపీ ఓసీపీ ఫేజ్​–-2 విస్తరణ గని ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, గని విస్తరణపై సందేహాలు ఉన్నవారు పబ్లిక్​ హియరింగ్​లో పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని మందమర్రి సింగరేణి ఏరియా  జీఎం -ఎన్​.రాధాకృష్ణ కోరారు.