రసాభాసగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ

రసాభాసగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ

యాదగిరిగుట్ట, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ ఆఫీసర్లు నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బాధితులు నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారని ప్రశ్నించారు. ఇప్పటికే మూడుసార్లు అలైన్ మెంట్ మార్చారని దుయ్యబట్టారు.

బడా బాబులకు లబ్ధిచేకూరేలా, పేద రైతులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేశారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న బాధితులకు భూమితో పాటు పరిహారం చెల్లించాలన్నారు. కాగా, రైతుల అభిప్రాయాలను సేకరించిన ఆఫీసర్లు.. రిపోర్టు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆఫీసర్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో తక్కువ మంది రైతులు హాజరయ్యారు