రంగారెడ్డి జిల్లాలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్

రంగారెడ్డి జిల్లాలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్
  • 10 కేంద్రాల్లో ప్రారంభించనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ

ఎల్​బీనగర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత పబ్లిక్ రీడింగ్ రూమ్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం మొదట రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసిందని.. మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో వెంటనే ప్రారంభించేలా జిల్లా గ్రంథాలయ సంస్థ చర్యలు ప్రారంభించిందని ఆయన చెప్పారు.  

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన మేరకు ప్రయోగాత్మకంగా వెంటనే 10 కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు మొదలుపెట్టామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి, కందుకూరు మండలం మాదాపూర్, తుక్కుగూడ మున్సిపాలిటీ మంకాలలో మంత్రి సబితా గురువారం వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా కావాల్సిన స్టడీ మెటీరియల్స్​ను ఈ రీడింగ్ రూమ్​లలో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. తొందరలోనే జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.