కరోనా చికిత్సకు సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్

కరోనా చికిత్సకు సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్

కరోనా చికిత్స కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్లు ఇస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు. తమ ఎస్‌బీఐ బ్యాంకులే కాక అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈ రుణాలు మంజూరు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. పర్సనల్ లోన్ కింద కనీసం రూ. 25,000 గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. కరోనా చికిత్స కోసం తీసుకునే పర్సనల్ లోన పై ఎస్‌బీఐ కేవలం 8 శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించిందని, ఇతర బ్యాంకుల వడ్డీ భిన్నంగా ఉండొచ్చన్నారు. అత్యవసర వ్యక్తిగత రుణ పథకం (ఎమర్జన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌-ECLGS) కింద కరోనా చికిత్సకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్‌ (ఐబీఏ) ఛైర్మన్‌ రాజ్‌ కిరణ్‌ రాయ్‌, ఐబీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ మెహతాతో కలిసి ఎస్‌బీఐ ఛైర్మన్‌ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.