
మెదక్ టౌన్/సంగారెడ్డి టౌన్/కంది/కొండాపూర్/కొమురవెల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని ఆయా రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు సూచించారు. గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల నిర్వహించిన అసెంబ్లీ ప్రవాసీ యోజన కార్యక్రమాలకు వారు హాజరయ్యారు. మెదక్లో కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే సురేశ్శెట్టి, కొమురవెల్లిలో కర్ణాటకలోని తీర్థల్ ఎమ్మెల్యే సిద్ధు సవాడి, సంగారెడ్డిలో
కొండాపూర్లో, కంది మండలం మామిడిపల్లిలో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ అవినాష్ సింగ్ పటేల్ స్థానిక నేతలతో కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దింపి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా మరిన్నీ హామీలు ఇస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.