స్కూల్ యూనిఫాంలో అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు

స్కూల్ యూనిఫాంలో అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందజేయకపోవడాన్ని నిరసిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు పాఠశాల యూనిఫాం ధరించి అసెంబ్లీకి వచ్చారు. దాంతో పాటు ఐడీ కార్డులు ధరించి, సైకిళ్లపై పుదుచ్చేరి శాసనసభా హాలుకు చేరుకున్నారు. పాఠశాలలు ప్రారంభమై 8 నెలలవుతున్నా  పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు స్కూలు బ్యాగులతో ఇలా అసెంబ్లీకి రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు.