
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్, పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షల విరాళం అందచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భారత్ కే వీర్ కార్పస్ ఫండ్ ను నిర్వహిస్తోంది. ఎన్‌సీసీ లిమిటెడ్ తరుపున ఎన్‌సీసీ ఐహెచ్ఎల్ డైరెక్టర్ రఘు అల్లూరి సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నగర్ కు రూ.50 లక్షల చెక్‌ను అందచారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో 40 మందికిపైగా జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.