ఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..

ఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..

పేరుకు పెద్ద నగరం.. మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద రెండో నగరం అది..ఆర్థికంగా, పారిశ్రామికంగా ముఖ్యమైన నగరం.. అనేక విశ్వ విద్యాలయాలు.. కళాశాలలకు నిలయం... ది ఆక్స్​ ఫర్డ్​ ఆఫ్​ ది ఈస్ట్​ విజేత అయిన పుణె నగరంలో  అపరిశుభ్రత, కలుషిత నీటి వనరులు రాజ్యమేలుతున్నాయి. వీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫుడ్​పాయిజనింగ్​తో అక్కడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలు, కంటి జబ్బులు వంటి సీజనల్​వ్యాధులు పెరుగుతుండటంతో ఈ నగరవాసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. 

పుణె నగరంలో కలుషిత ఆహారం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. నగరంలో జ్యూస్​ సెంటర్లు, టీ కియోస్క్​ లు, వడ పావ్​ దుకాణాలు ఎటువంటి లైసెన్స్​ లేకుండా.. యధేచ్చగా కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారు. ఫుణె  నగరంలో ప్రతిరోజు హోటళ్లు, వీధి వ్యాపారులు తాగునీటితో పాటు నాణ్యతలేని ఆహారాన్ని విక్రయిస్తున్నారు. 

Also Read :- టిఫిన్ తినకముందే.. ఈ 5 యోగాసనాలు వేయండి.. ఫుల్ జోష్

సంపాదనే లక్ష్యంగా  వీరు విక్రయించే ఫుడ్​లో ఎలాంటి పోషకాలు ఉండవు. ఆహార పదార్థాల​ తయారీలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.  గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలు, కంటి జబ్బులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయితే ఋ విషయంపై పుణె మున్సిపల్​ కార్పొరేషన్​ (పీఎంసీ)  ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
  
 జంక్​ ఫుడ్, కలుషిత నీరు వల్ల ఫుడ్​ పాయిజనింగ్ అవుతుంది. వర్షాకాలంలో ఫిల్టర్​ చేసిన లేదా మరిగించిన నీటిని తాగడం చాలా ముఖ్యం.. పండుగలు, సెలవుల్లో ఎక్కువ మంది రెస్టారెంట్లు, హోటళ్లు, బయట ఫుడ్​ కు తింటున్నారు.. ప్రజలు తప్పని సరిగా పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పుణెలోని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఫుడ్​ మాత్రమే తినాలని సూచిస్తున్నారు.