టిఫిన్ తినకముందే.. ఈ 5 యోగాసనాలు వేయండి.. ఫుల్ జోష్

టిఫిన్ తినకముందే.. ఈ 5 యోగాసనాలు వేయండి.. ఫుల్ జోష్

ఈ మధ్య కాలంలో దాదాపు అందరికీ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగిపోతోంది. దీంతో సమయం చేసుకుని మరీ యోగాసనాలు వేస్తున్నారు. వ్యాయామం చేసేందుకు సమయం వెచ్చిస్తున్నారు. అయితే ఉదయం టిఫిన్ చేయకముందే చేసే ఆసనాలు మంచి ఫలితాలిస్తాయని, అందులో ముఖ్యంగా మార్జారీ ఆసనం లేదా పిల్లి ఆసనం అనేది వెన్నెముక, పొట్ట, కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, ప్రేగులు, థైరాయిడ్ సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుందని యోగా నిపుణులు కామినీ బోబ్డే చెప్పారు.

ఆరోగ్యకరమైన వెన్నెముక, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఈ మార్జాల ఆసనం మేలు చేస్తుంది. సమయం లేని వారికి ఈ ఆసనం మంచి ఉపయోగకారిగా ఉంటుంది. ఇక ఈ ఆసనం ఎలా వేయాలన్ని విషయానికొస్తే.. శరీరాన్ని సాగదీస్తూ చేసే ఈ ఆసనం ఓ రకమైన స్ట్రెచింగ్ లాంటిది. రెండు చేతులను, పాదాలను నేలకు ఆనించి, నడుమును వంచి చేసే ఈ ఆసనం వల్ల ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. ముఖ్యంగా నిద్ర లేవగానే ఈ ఆసనం చేస్తే మంచిదని బోబ్డే అంటున్నారు.

Also Read :- ఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..

మార్జారీ ఆసనం వల్ల లాభాలు

బీపీ, గుండె జబ్బులు, మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి ఈ ఆసనం మేలు చేస్తుంది. మోకాళ్ల సమస్యలున్న వాళ్లు మోకాళ్ల కింద కుషన్ పెట్టుకుని దీన్ని ప్రయత్నించవచ్చు. దీని వల్ల వెన్నెముక, జీర్ణవ్యవస్థ, థైరాయిడ్ గ్రంథుల ఆరోగ్యం మెరుగవుతుంది. మొబైల్ వాడకం వల్ల వచ్చే సమస్యలను సైతం ఈ ఆసనం నివారిస్తుంది. నాడీ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది.

  • ఈ ఆసనంలో శరీరాన్ని సాగదీయాల్సి ఉంటుంది. ఫలితంగా మెడ సైతం సాగి థైరాయిడ్ గ్రంథులకు మసాజ్ చేస్తుంది. హార్మోన్ల సరిగ్గా విడుదలయ్యేందుకు ఇది సహకరిస్తుంది.
  • ఇది మణికట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
  • మొబైల్ లేదా ఇతర గాడ్జెట్ లను ఉపయోగించడం వల్ల తలెత్తే భుజాలు, మెడ నొప్పులు, ఒత్తిడి, టెన్షన్ వంటి వాటిని నివారించడంలో ఇది సహాయపడుతుంది.
  • చేతుల కండరాలకు సాయం చేస్తుంది.
  • మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • కాలేయం, కడుపు, మూత్ర పిండాలు, పేగులు వంటి జీర్ణ వ్యవస్థ అవయవాలను సక్రియం చేస్తుంది.