పూణే యాక్సిడెంట్: డ్రైవర్ పై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల అనుమానం..

పూణే యాక్సిడెంట్: డ్రైవర్ పై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల అనుమానం..

ఇటీవల పుణేలో జరిగిన పోర్స్చే కార్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ కి కారణమైన వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు పూణే పోలీసులు. అయితే, దర్యాప్తులో కీలక అంశాలు బయటపడుతున్నాయి.  యాక్సిడెంట్ సమయంలో మైనర్ స్పృహలోనే ఉన్నాడని, ఏం జరుగుతుందో కారులో ఉన్న అందరికీ స్పృహ ఉందని అన్నారు పూణే కమిషనర్. మైనర్ పబ్ లో మద్యం సేవిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయని అన్నారు.

ఈ కేసు నుండి మైనర్ ను తప్పించేందుకు అతని కుటుంబం డ్రైవర్ పై ఒత్తిడి తెచ్చినట్లు అనుమానం ఉందని, అందుకే అతను యాక్సిడెంట్ ను తనపై వేసుకున్నాడని అనుమానం ఉన్నట్లు తెలిపారు కమిషనర్. ఈ యాక్సిడెంట్లో డ్రైవర్ పాత్ర ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు కమిషనర్. నిందితుల బ్లడ్ శాంపిల్స్ ను టెస్టింగ్ కి పంపామని, రిపోర్ట్స్ రాగానే ఫోరెన్సిక్ కి పంపామని తెలిపారు. DNAను కూడా టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ కి పంపినట్లు తెలిపారు కమీషనర్.