
పూణేలోని మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో(CME) విషాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. కాలేజ్‌లోని సాంకేతిక శిక్షణా కేంద్రంలో మొబైల్ బ్రిడ్జిపై శిక్షణ కొనసాగుతుండగా ఈ సంఘటన జరిగిందని రక్షణ అధికారులు తెలిపారు. గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.