నిందితుడి బెయిల్ పిటిషన్‌పై చాట్‌ జీపీటీని అడిగిన హైకోర్టు

నిందితుడి బెయిల్ పిటిషన్‌పై చాట్‌ జీపీటీని అడిగిన హైకోర్టు

ఓ నిందితుడి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికిచాట్‌ జీపీటీ టెక్నాలజీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించిన మొట్టమొదటి కోర్టుగా పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిచింది. అల్లర్లు, హత్య బెదిరింపులు, నేరపూరిత కుట్ర ఆరోపణలపై జూన్ 2020లో అరెస్టయిన నిందితుడి బెయిల్ పిటిషన్ పై విచారిస్తున్నప్పుడు అనూప్ చిట్కారా నేతృత్వంలోని ధర్మాసనం చాట్‌ జీపీటీ టెక్నాలజీని ఆశ్రయించింది. ఆ నిందితుడికి బెయిల్‌ మంజూరు విషయంలో పలు సూచనల గురించి చాట్‌ జీపీటీని అడిగి తెలుసుకుంది.

క్రూరత్వం కారణంగానే మనుషులను చంపుతున్నారు కాబట్టి తాను బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తారని చాట్‌ జీపీటీ సమాధానం ఇచ్చింది. అయితే ఆ దాడి తీవ్రతను బట్టి బెయిల్‌ మంజూరు చేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని తెలిపింది.ఒకవేళ నిందుతుడు బలమైన సాక్ష్యలతో తాను  నిర్దోషినని నిరూపించుకుంటే బెయిల్ కు అర్హుడని, లేదంటే అతనికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదంది. 

అంతేకాకుండా నిందితుడి నేర చరిత్ర, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని అతడికి బెయిల్ మంజూరు చేయవచ్చునని చాట్‌ జీపీటీ తెలిపింది. అయితే చాట్‌ జీపీటీ టెక్నాలజీని ఉపయోగించడం పట్ల జడ్జిలు స్పందించారు. న్యాయశాస్త్రంపై చాట్‌ జీపీటీ ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేశామన్నారు.