పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు

పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు

దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఘోర ఓటమిని చవిచూశారు. ఓటమితో తీవ్ర మనోవేదనకు గురై చివరకు మీడియా ముందు కూడా మాట్లాడలేక బావురుమని విలపించాడు.

పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు  నీతు సుతేరన్‌ వాలా. అతని కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది.  కాని ఈ ఎన్నికల్లో అతనికి వచ్చిన ఓట్లు మాత్రం కేవలం ఐదు. దీంతో సొంత కుటుంబ సభ్యులే తనను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఓటమికి ఈవిఎంల ట్యాంపరింగ్ కూడా ఓ కారణమని అక్కడున్న ఓ రిపోర్టర్ తో అన్నాడు.

దీంతో ఆ రిపోర్టర్ పుండు మీద కారం పూసినట్టుగా.. సొంత కుటుంబ సభ్యులే మీకు సపోర్ట్ చేయనప్పుడు ఎంపీగా ఎన్నికల్లో ఎలా గెలుస్తానని భావించారు? అని అడిగిన ప్రశ్నకు  నీతు సుతేరన్‌ వాలా మళ్లీ ఏడుపు మొదలెట్టాడు.

punjab-candidate-cries-after-getting-only-5-votes-says-there-are-9-members-in-his-own-family