కబడ్డీ ఆటగాడిపై కాల్పులు.. పరిస్థితి విషమం

కబడ్డీ ఆటగాడిపై కాల్పులు.. పరిస్థితి విషమం

పంజాబ్‌లోని మోగా జిల్లాలో ధుల్కోట్ రాన్సిన్ గ్రామంలో హర్విందర్ సింగ్ అనే కబడ్డీ ప్లేయర్‌పై దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు.. కాల్పులు జరపడానికి ముందు ఏదో సాకుతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం కనిపించింది.

స్థానిక నివేదికల ప్రకారం, గాయపడిన కబడ్డీ ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉంది. తదుపరి చికిత్స కోసం ఆయన్ను వైద్యులు లుథియానాకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

Also Read : Good Health : చికెన్ Vs మటన్ : బరువు తగ్గటానికి ఏది బెస్ట్