రాష్ట్ర మంత్రిని కరిచిన పాము.. ఆస్పత్రిలో చికిత్స.. విష నాగు అంట

రాష్ట్ర మంత్రిని కరిచిన పాము.. ఆస్పత్రిలో చికిత్స.. విష నాగు అంట

వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బైన్స్‌ పాము కాటుకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని కిందికి విడుదల చేస్తుండటంతో పంజాబ్‌లోని పలు జిల్లాలు జలమయమయ్యాయి. దీంతో వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యారు. 

హర్‌జోత్‌ సింగ్‌ రూప్‌నగర్‌ జిల్లాలోని ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున వరదను కిందికి వదలడంతో బియాస్‌, సట్లెజ్‌ నదులు పొంగి.. స్థానికంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీ రాత్రి సమయంలో పంజాబ్ మంత్రి హర్ జోత్ సింగ్ బైన్స్ వరద సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ విషపూరిత పాము ఆయన్ను కాటు వేయడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదంతో తాను ఇప్పుడు క్షేమంగా ఉన్నానని చెప్పారు.