ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తిని కలిగిస్తుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఇండియాలో ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. ప్పటి నుంచే ప్రాంఛైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ పై ఒక ఒక అంచనాకు వచ్చాయి. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. గత సీజన్ లో తుది మెట్టుపై బోల్తా పడిన పంజాబ్ రానున్న సీజన్ లో టైటిల్ పై కన్నేసింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
యుజ్వేంద్ర చాహల్:
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను పంజాబ్ జట్టు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో రూ. 18 కోట్లకు పంజాబ్ జట్టులో చేరిన చాహల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. వీటిలో రెండు సార్లు నాలుగు వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చాహల్ ఎకానమీ 9.55 ఉండడం ఈ లెగ్ స్పిన్నర్ కు మైనస్ గా మారింది. ఐపీఎల్ లో అత్యంత విజవంతంగా స్పిన్నర్ చాహల్ ప్రస్తుతం ఎలాంటి మ్యాచ్ లు ఆడడం లేదు. దీంతో ఈ స్పిన్నర్ ను రిలీజ్ చేసే అవకాశాలు పుస్కలంగా ఉన్నట్టు టాక్.
గ్లెన్ మ్యాక్స్ వెల్:
ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించక చాలా కాలమే అయింది. స్టార్ ఆటగాడిగా ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు కల్పించినా తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాడు. 2013 సీజన్ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన ఈ ఆసీస్ స్టార్ చేయలేదు. ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ తరపున ఘోరంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్ ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్స్ వెల్ ను రిలీజ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరోన్ హార్డీ:
ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ ఆరోన్ హార్దీని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. జట్టులో స్టోయినిస్, జాన్సెన్, సూర్యాన్ష్ షెడ్జ్ లాంటి ఆల్ రౌండర్లు ఉండడంతో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ అవసరమే లేకుండా పోయింది.
ముషీర్ ఖాన్:
ముంబై యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ పంజాబ్ జట్టులో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. టెస్ట్ బ్యాటర్ గా పేరు గాంచిన ముషీర్ ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ రావడం కష్టమే. ముషీర్ డొమెస్టిక్ క్రికెట్ లో టీ20 మ్యాచ్ లు కూడా ఆడడం లేదు. ముంబై జట్టులో అతనికి చోటు కూడా దక్కడం లేదు. ముషీర్ ను పంజాబ్ జట్టులో ఎక్కడ సరిపోతాడో క్లారిటీ కూడ లేదు. దీంతో ఈ ముంబై యువ క్రికెటర్ కు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పంజాబ్ స్క్వాడ్:
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, లాకీ హర్మత్, లాకీ హర్మత్, లాకీ కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.
