టాట్యూ ఆధారంగా యువతి మర్డర్ కేసు మిస్టరీ రివీల్

టాట్యూ ఆధారంగా యువతి మర్డర్ కేసు మిస్టరీ రివీల్
  • కిందటేడాది పంజాబ్ యువతి దారుణ హత్య
  • తల, మొండెం వేరు చేసి చేతులు నరికివేత
  • ప్రియుడే హంతకుడని తేల్చిన యూపీ పోలీసులు

లక్నో: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యంత దారుణంగా నరికి చంపేసిన19 ఏళ్ల యువతి మర్డర్ కేసు మిస్టరీని యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రియుడే హంతకుడని తేల్చారు. ఇందులో హస్తం ఉన్న అతని కుటుంబ సభ్యులు ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. 2019 జూన్ 14న యూపీలోని మీరట్ దగ్గరలో జరిగిన టీనేజ్ యువతి మర్డర్ కేసు వివరాలను మీరట్ పోలీస్ చీఫ్​ అజయ్ సాహ్ని మీడియాకు వెల్లడించారు.

ట్యాక్సీ బిజినెస్ చేసే యూపీలోని లోహియాకు చెందిన మహమ్మద్ షాకిబ్ పంజాబ్​లోని లూధియానాలో కు చెందిన 19 ఏళ్ల యువతి ఏక్తా జస్వాల్ తో పరిచయం ఏర్పడింది. తనను తాను హిందువుగా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. కొన్ని నెలల తర్వాత జైస్వాల్ ఇంట్లోంచి రూ.25 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాల తీసుకుని షాకిబ్ తో పారిపోయింది. మీరట్​లో కొద్దిరోజుల పాటు నివాసం ఉన్నారు. తన అసలు రంగు బయపడే అవకాశాలుండటంతో జైస్వాల్ ను చంపేయాలని నిశ్చయించుకున్న షాకిబ్.. ఒక రోజు యువతి తాగే కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగానే దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు. ఆపై తల మొండెం వేరు చేసి, చేతులు నరికి వేసి పరారయ్యాడు.
ఈ కేసులో డెడ్​బాడీ ఎవరిదో గుర్తించేందుకు పోలీసులకు నెలల తరబడి సమయం పట్టింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు డెడ్​బాడీని గుర్తించి ఆమె వాడిన ఫోన్ నెంబర్, జైస్వాల్ బాడీపై ఉన్న టాట్యూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి.. హంతకుడిని పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు నగలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహమ్మద్ షాకిద్.. జైస్వాల్ ను చంపేసిన తర్వాత కూడా ఆమె బతికే ఉన్నట్లు కుటుంబ సభ్యులను, బంధువువలను నమ్మించేందుకు ఆమె మొబైల్ నంబర్ ను వాడుతూ ఫోటోలు అప్ లోడ్ చేసేవాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.