దినసరి కూలీగా అంతర్జాతీయ కరాటే ప్లేయర్

V6 Velugu Posted on Jun 11, 2021

ఒకప్పుడు దేశం తరపున ఇంటర్నేషనల్ స్థాయిలో కరాటే పోటీల్లో పాల్గొన్న అథ్లెట్..ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు రోజు వారీ కూలీగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలను సాధించి పెట్టిన ఆమె..వరి పొలాల్లో పని చేస్తోంది.

పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల హర్దీప్‌ కౌర్‌.. అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం..రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చదువుకుంటూనే.. తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన హర్దీప్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్‌ క్రీడామంత్రి రాణా గుర్మీత్‌ సోధీ హామీ ఇచ్చారు.

 అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత  కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ తెలిపింది.

Tagged Punjab karate player, Hardeep Kaur, farm labourer work, paddy fields

Latest Videos

Subscribe Now

More News