కాకా అనే టైటిల్‌తో పూరీ, బాలయ్య మూవీ?

కాకా అనే టైటిల్‌తో పూరీ, బాలయ్య మూవీ?

పూరీ జగన్నాధ్( Puri Jagannadh)  డైరెక్షన్ లో వచ్చిన పైసా వసూల్ మూవీ బాలకృష్ణ( Balakrishna)ను  మరో యాంగిల్ లో చూపించిన విషయం తెలిసేందే. వీరి కాంబో లో మరో మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. పూరీ మార్క్ అనేది హీరోలకు గుర్తుండిపోయే విజన్. ఒక్కసారి పూరి డైరెక్షన్  లో సినిమా వచ్చాక ఆ హీరో కటౌట్ ను పూర్తిగా మార్చేస్తారు పూరీ. ఇప్పుడు బాలయ్యను మరో ఎనర్జీటిక్ యాంగిల్ లో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది. 

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి, ఆ తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నారు. పూరీ  డబుల్ ఇస్మార్ట్ రామ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాకబాలయ్య బాబు మూవీను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. 

ALSOREAD :మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ రూ.90 వేలా..?!

పూరి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి కాకా అనే టైటిల్‌ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ ఈ సారి బాలయ్యను ఎలాంటి స్టైల్ లో చూపిస్తారో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ ప్రాజెక్ట్ పై  అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలో వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.