Chiranjeevi: పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ ఆశీస్సులు.. 'పూరి సేతుపతి' టీమ్.. ఫొటో వైరల్!

Chiranjeevi: పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ ఆశీస్సులు.. 'పూరి సేతుపతి' టీమ్.. ఫొటో వైరల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'పూరి సేతుపతి'. ఈ మూవీలో  కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా,  టబు హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ గా పూరి టీం మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పంచుకుంది.

ఒకే లొకేషన్‌లో రెండు షూటింగ్‌లు

ప్రస్తుతం పూరి జగన్నాథ్.. 'పూరి సేతుపతి' సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుతున్నారు. అయితే, అదే లొకేషన్‌కి దగ్గరలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తదుపరి చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' కోసం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రీకరణలో ఉన్నారు. ఒకే ప్రాంగణంలో రెండు భారీ చిత్రాల షూటింగ్ జరగడంతో, 'పూరి సేతుపతి' టీమ్ చిరంజీవిని కలిసింది. కాసేపు మూవీ గురించి ముచ్చటించుకున్నారు.

వైరల్ అవుతున్న ఫోటో

ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోను చిత్రబృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలో చిరంజీవితో పాటు నయనతార, అనిల్ రావిపూడి,  పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, నటి టబు, ఛార్మీ కౌర్ ఉన్నారు.  నయనతార 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుండటంతో ఈ ఫోటో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

'పూరి సేతుపతి'పై అంచనాలు

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి డైలాగ్స్, టేకింగ్‌కు విజయ్ సేతుపతి నటన తోడైతే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, చిరంజీవి, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' కూడా భారీ అంచనాలను మోసుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు ఒకే చోట జరుగుతుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భవిష్యత్తులో వీరి కలయికలో సినిమా వస్తుందేమో అని కొందరు అభిమానులు ఆశపడుతున్నారు.

►ALSO READ | బెల్లంకొండ 'కిష్కింధపురి' ఛాలెంజ్.. పది నిమిషాలు ఫోన్ చూస్తే ఇండస్ట్రీకి గుడ్ బై!