‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ

‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ

చిత్రం: పుష్పక విమానం

సమర్పణ : విజయ్ దేవరకొండ

సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్

ఆర్ట్ డైరెక్టర్: నీల్ సెబాస్టియన్

ఎడిటర్: రవితేజ గిరిజాల

మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని

నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి 

రచన, దర్శకత్వం: దామోదర

విడుదల తేదీ: 12 నవంబర్, 2021

విశ్లేషణ

దర్శకుడు దామోదర అనుకున్న కథను బాగానే ప్రజెంట్ చేశాడు. ఒక చిన్న లైన్ తీసుకొని ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు.కాకపోతే కొన్ని సాగదీత సీన్లు ఉన్నాయి. సెకండాఫ్ నెమ్మదిగా సాగుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఫస్టాఫ్ టైమ్ పాస్ అయినా.. సెకండాఫ్ స్లోగా సాగింది. ఓవరాల్‌‌గా కొన్ని కామెడీ సీన్లు, నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

కథేంటి..!

గవర్నమెంట్ స్కూల్ టీచర్‌‌గా పని చేసే చిట్టి లంక సుందర్ (ఆనంద్ దేవరకొండ)కు కొత్తగా పెళ్లి అవుతుంది. పెళ్లవగానే హైదరాబాద్‌కు వచ్చి తన జీవితాన్ని మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి (మీనాక్షి) సుందరిని వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో తన భార్య లేచిపోయిందని అనుకున్న సుందర్.. ఏ విధమైన కష్టాలను ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత తన భార్యను కనుగొనే ప్రయత్నంలో ఏ విధమైన ఇబ్బందులు పడ్డాడు, తన భార్య ఏమయిందనేదే ఈ సినిమా కథ. 

నటీనటులు 

తొలి రెండు చిత్రాలతో నటుడిగా తనను తాను నిరూపించుకున్న ఆనంద్ దేవరకొండ.. ప్రభుత్వ స్కూల్ టీచర్‌‌గా ఎంతో సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఈ చిత్రంలో ఆయన కూల్‌గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. గీత్ శైని తన అభినయంతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. మరో హీరోయిన్ శాన్వీ మేఘన కూడా ప్రేక్షకులను తన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షించింది. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన హీరో సునీల్.. తన పాత్రలో రాణించాడు. నరేష్, కిరీటి, గిరిధర్ వంటి నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు 

ఈ సినిమాకు హైలైట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఇప్పటికే పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా.. నేపథ్య సంగీతం కూడా అందరినీ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన ఈ సినిమా నిర్మాణ విలువలు ఎంతో రిచ్‌‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌‌లో కొన్ని సీన్లు లేపేయాల్సింది.

ప్లస్ పాయింట్స్: కామెడీ, హీరో నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.

మైనస్ పాయింట్స్: కొన్ని చోట్ల సాగదీత సీన్స్.

రివ్యూ : టైం పాస్ విమానం.

మరిన్ని వార్తల కోసం: 

సీఈవోను చెంపదెబ్బ కొట్టే జాబ్.. గంటకు 6 వందల జీతం

కివీస్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌కు రెస్ట్, కెప్టెన్‌గా రహానె

వరుసగా మూడోసారి.. పరేడ్‌ను లీడ్‌ చేసిన మహిళా కమాండర్‌‌